Header Banner

కారు డోరు తీయబోతే అడ్డుకున్న మాజీ మంత్రి..! అసలేం జరిగిందంటే?

  Sat May 10, 2025 18:19        Politics

మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజినికి, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. కారు వద్ద తోసుకునే వరకూ వ్యవహారం వెళ్లింది. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం మానుకొండవారి పాలెంలో ఈ ఘటన చోటుచేసుకుంది, మానుకొండవారి పాలెం గ్రామంలో ఓ కుటుంబాన్ని పరామర్శించేందుకు విడదల రజిని వచ్చారు. అయితే విడదల రజినితో పాటుగా ఆమె ప్రధాన అనుచరుడు శ్రీకాంత్ కూడా కారులో మానుకొండవారి పాలెం వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే నాదెండ్ల పోలీసులు విడదల రజిని అనుచరుణ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా.. ఆమె అడ్డుకున్నట్లు సమాచారం. దీంతో విడదల రజినికి పోలీసులకు మధ్య వాగ్వాదం, స్వల్ప తోపులాట జరిగాయి.

శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా.. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పాలంటూ విడదల రజిని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే పోలీసులు బలవంతంగా కారులోని శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా.. మాజీ మంత్రి అడ్డుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు సహకరించాలని పోలీసులు చెప్తున్నప్పటికీ.. విడదల రజిని అడ్డుగా రావటంతో, పోలీసులు కాస్త దూకుడుగా వ్యవహరించారు. దీంతో మాజీ మంత్రి మండిపడ్డారు. తాను మాజీ మంత్రినని చెప్తూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తమను డ్యూటీ చేయాలని, అడ్డుకుంటే విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేస్తామని.. స్థానిక సీఐ సుబ్బారాయుడు విడదల రజినికి తెలిపారు. పోలీసులు శ్రీకాంత్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం.. విడదల రజిని అడ్డుకోవటానికి యత్నించటంతో మానుకొండవారి పాలెంలో కాసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

మరోవైపు వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించారని మాజీ మంత్రి విడదల రజినిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో విడదల రజిని మరిది గోపీని ఇటీవల పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. విజిలెన్స్‌ తనిఖీల పేరుతో తనను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని యడ్లపాడులోని లక్ష్మీబాలాజి స్టోన్‌ క్రషర్స్ యజమాని అయిన నల్లపనేని చలపతిరావు ఫిర్యాదు చేశారు. చలపతిరావు ఫిర్యాదుఆధారంగా ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి విడదల రజిని, విడదల రజిని మరిది గోపి, విడదల రజిని పీఏ రామకృష్ణ, అప్పటి విజిలెన్స్ అధికారి జాషువాలపై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో 41ఏ కింద విడదల రజినికీ నోటీసులు అందించి.. ఆ తర్వాత విచారించాలని ఏపీ హైకోర్టు ఇటీవల పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని విడదల రజినికి హైకోర్టు సూచించింది.

ఇది కూడా చదవండి: వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం! కొత్త రేషన్ కార్డ్ తీసుకోవడానికి ఇవే రూల్స్...!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

బోర్డర్ లో టెన్షన్ టెన్షన్! ప్రధాని మోదీ ఎమర్జెన్సీ మీటింగ్.. సంచలన నిర్ణయం!

 

అన్నవరం ఆలయంలో వైసీపీ ఎమ్మెల్సీ ఓవరాక్షన్.. వాడువీడు అంటూ అధికారిపై మండిపాటు!

 

3 గంటలు ముందే రావాలి.. ప్రయాణికులకు ఎయిర్‌లైన్స్‌ సూచన!

 

యుద్ధం.. ఢిల్లీ ఉద్యోగుల సెలవులు రద్దు.. సరిహద్దు ప్రాంతాల్లో హై అల‌ర్ట్‌!

 

ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం.. టీడీపీ ఎంపీ కుటుంబంలో విషాదం! ఏపీకి చెందిన మరో వ్యక్తి..

 

జగన్ కు ఊహించని షాక్! లిక్కర్ స్కాం లో నిందితులకు సుప్రీంలో చుక్కెదురు!

 

తిరుపతి జిల్లాలో మరో కీలక ప్రాజెక్టు.. నేడు శంకుస్థాపన చేయనున్న మంత్రి!

 

అలర్ట్.. 400కిపైగా ప్లైట్స్ క్యాన్సిల్.. 27విమానాశ్రయాలు మూసివేత.. ఏఏ ప్రాంతాల్లో మూతపడ్డాయంటే..

 

పాక్‌కు యూకే షాక్‌.. వీసాలపై పరిమితులు! కొత్త నిబంధనల్లో భాగంగా...

 

ఏపీలో వారికి గుడ్ న్యూస్..! తల్లికి వందనం ఎప్పటినుంచంటే..?

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #FormerMinister #ViralIncident #WhatHappened #BreakingNews #PoliticalBuzz #UnexpectedMove #CarDoorDrama